ఇబ్రహీంపట్నం, చర్లపల్లి, బండ్లగూడ, సెప్టెంబర్ 16 : నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
చర్లపల్లిలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి పడేసి గుర్తు తెలియని వారు పారేసి వెళ్లిపోయారు. రాజేంద్రనగర్లోని కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఓ మహిళను చంపి మృత దేహాన్ని అక్కడ పడేసి వెళ్లారు. సదరు మహిళ ఒంటిపై బట్టలు లేక పోవడంతో ఎవరైన అత్యచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.