Maha news Case | మహాన్యూస్ కార్యాలయం దగ్గర నిరసన కేసులో వెస్ట్ జోన్ పోలీసుల అత్యుత్సాహంపై అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. A 2 నర్సింగ్ , A3 జంగయ్యలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటల కన్నా ఎక్కువగా తమ అదుపులో ఉంచుకోవడం బీఎన్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నర్సింగ్, జంగయ్యలను జూన్ 29న ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకుని జూన్ 30 మధ్యాహ్నం 2 .30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించి నిబంధనలను అతిక్రమించారని న్యాయమూర్తి అన్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ విచారణాధికారికి తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్