హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో (Kukatpally) రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.