అంబర్‌పేట, సెప్టెంబర్ 8 : మాజీ మేయర్ దివంగత కృష్ణస్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను బుధవారం కలిసి విన్నవించింది.
ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ నేతృత్వంలో ప్రతినిధులు తూర్పు రాంచందర్, బాల్‌రాజ్, అంజయ్యముదిరాజ్, రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ్ ముదిరాజ్, సురేష్, బాలకృష్ణ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయర్‌గా పనిచేసిన కృష్ణస్వామి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలన్నారు.