ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఆయన అన్నారు.
- వానకాలం నాటికి మూసారాంబాగ్ హైలెవల్ బ్రడ్జి నిర్మాణం
- రూ.53 కోట్ల నిధులు మంజూరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక
- మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
గోల్నాక, జూలై 25 : మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఆయన అన్నారు. వారం రోజులుగా భారీగా వర్షాలు కు రుస్తున్న నేపథ్యంలో మంగళవారం అధికారులు, కా ర్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి అంబర్‌పేట మూసారాంబాగ్ బ్రడ్జి వద్ద వరదనీటి ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనై ఎదుర్కొనేందుకు అధికార యం త్రాగం సిద్ధంగా ఉందన్నారు.
భారీగా వస్తున్న మూసీ వరద ఉధృతితో మూసారాంబాగ్ బ్రిడ్జ్ తరచూ మునిగి పోతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ రూ.53 కోట్ల నిధులు మంజూ రు చేశారని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అవసరమైన చోట్ల రిటైనింగ్ వాళ్ల నిర్మాణాలు కూడా చేపతున్నామని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాలాలా పూడిక తీత పనులతో పాటు వరదనీటి పైప్లైన్ల ప్రక్షాళన చేపట్టడంతో గరిష్ట వర్షపాతం నమోదవుతున్నా ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదన్నారు. పలు శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇండ్లు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ
అంబర్‌పేట, జూలై 25 : హుస్సేన్‌సాగర్ సర్ప్లేస్ నాలా కు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన శివానంద్నగర్ వాసులకు నష్టపరిహారం కింద జీహెచ్ఎంసీ ద్వారా వచ్చిన రూ. 1.20 కోట్ల విలువైన చెక్కులను బాధితులకు నల్లకుంట కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మంగళవారం అందజేశారు. ప్రతి సంవత్స రం వానాకాలంలో హుస్సేన్‌సాగర్‌ను ఆనుకొని ఉన్న రత్నానగర్, శివానంద్నగర్ తదితర బస్తీలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఇండ్లలోకి వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా హుస్సేన్‌సాగర్ నాలాకు ఆనుకొని ఉన్న రత్నానగర్, శివానంద్నగర్ బస్తీ వాసులు నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు ప్రభుత్వం రూ.60 కోట్లతో హుస్సేన్‌సాగర్ సర్ప్లేస్ నాలకు అశోక్‌నగర్ నుంచి మూసీ వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా నల్లకుంట శివానంద్నగర్లో రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇండ్లను కోల్పోయిన 12 మందికి రూ.1.20 కోట్ల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రత్నానగర్, వెంకటేశ్వరనగర్ వాసులకు కూడా ఇలాగే నష్టపరిహారం కింద చెక్కులను అందజేస్తామని అన్నారు. యాభై శాతం ఇండ్లు పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న చెక్కులు కేవలం ఇంటి నిర్మాణానికి సంబంధించినవని, ఇంటి స్థలానికి త్వరలోనే టీడీఆర్ చెల్లిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, సిబ్బంది మహేశ్, బాబుమియా, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు గాలపల్లి శంకర్, వీరయ్యగౌడ్, ఎస్.మూర్తి, సతీశ్‌గౌడ్, బొజ్జ రాజు, జి. సురేశ్, ఖలీం, బస్తీ పెద్దలు అశోక్‌యాదవ్, శ్రీనివాస్‌చారి, శ్రీజిత్, శ్రీనివాస్‌గౌడ్, భీంరావు, బీజేపీ నాయకులు మధుయాదవ్, రమణానాయుడు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

