Kishan Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్లో మా ప్రయత్నం మేం చేశామని తెలిపారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఓటమిపై విశ్లేషించుకుంటున్నామని తెలిపారు.
జూబ్లీహిల్స్లో బీజేపీకి బలం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. మాకు అక్కడ కార్పొరేటర్లు కూడా లేరని అన్నారు. అయినప్పటికీ తమ శక్తినంతా కూడగట్టుకుని ప్రచారం చేశామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎంఐఎం మద్దతు, డబ్బుల పంపిణీతోనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాలపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టామని అన్నారు.