వెంగళరావునగర్, నవంబర్ 11: ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. దౌర్జన్యాలు, దాడులు, గూండాగిరితో కాంగ్రెస్ ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిగూడ శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సెంటర్లోని 290వ పోలింగ్ బూత్‌లో ఆమె తన తన కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర, దిశిరతోకలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బోగస్ ఓటర్ కార్డులు పట్టుకుని కాంగ్రెస్ దొంగ ఓట్లు వేసిందని ఆరోపించారు. బోగస్ ఓట్ల గురించి.. కాంగ్రెస్ నాయకుల ప్రలోభాల గురించి పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేవారే లేరని వాపోయారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూని చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు గూండాలు దౌర్జన్యాలు చేయడాన్ని తట్టుకోలేక ఆమె కంటతడి పెట్టుకున్నారు.