శామీర్‌పేట, ఆగస్టు 16 : మరిచిపోయి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ్యొద్దని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డితోపాటు తంటం రామస్వామి, పల్లె సందీప్‌గౌడ్, గౌరారం దేవేందర్, వైల రాజేశ్, గుర్క అనిల్‌కుమార్, బాలకృష్ణ, భిక్షపతి, విష్ణు, మహిళలు, యువకులు 100 మందికి బుధవారం మంత్రి బీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు సుదర్శన్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.