ఎర్రగడ్డ, జూలై 4 : బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది. తాజాగా గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు బస్ టెర్మినల్లో రెండు భారీ కటౌట్లను ఏర్పాటు చేశాడు. బల్దియా అధికారులు మాత్రం వాటిని తొలగించక పోవటం గమనార్హం. అదే బీఆర్ఎస్ వాళ్ళు కటౌట్లు పెడితే వెంటనే తొలగిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో అధికారులు వెంటనే ఆ కటౌట్లను తొలగించాలని.. ఇక నుంచి వాటి ఏర్పాట్లను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.