BRS | కొండాపూర్, నవంబర్ 19 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్‌కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సాధనలు చెప్పలేకపోతున్నట్లు నాయకులు వాపోతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్తను కలుపుకుని ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాలా హరీశ్, మల్లారెడ్డి, శ్రీకాంత్, సంగారెడ్డి, మల్లేశ్, రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.