Hyderabad | సిటీబ్యూరో: పోలీస్‌స్టేషన్‌లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్‌లలో అమలవుతున్న నిబంధన. ఒకవైపు డయల్ 100కు ఫోన్ చేసినా.. పట్టించుకోని పోలీసులు.. మరోవైపు ఠాణాల్లోకి పాత్రికేయులు రావొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు.
వెస్ట్‌జోన్ పరిధిలో ఈ నిబంధన అమలవుతున్నది. డీసీపీయే స్వయంగా జర్నలిస్టులను రావద్దని చెప్పారని, ఆ ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ.. కొందరు పేర్కొంటున్నారు. మధురానగర్ పీఎస్‌లోకి రిపోర్టర్లను అనుమతించమని, తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలని, మా ఇన్స్పెక్టర్ అమలు చేయమన్నారంటూ.. ఓ కానిస్టేబుల్ చెప్పి తిరిగి పంపిస్తున్నారు.