మల్కాజిగిరి, ఏప్రిల్ 24: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రెండో రోజు చెట్టు కింద కూర్చొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడంతో చెట్టు కింద కూర్చుని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా రెండో రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీతా యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.