జూబ్లీహిల్స్, అక్టోబర్ 27 : ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రమాదవశాత్తు చనిపోతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రూ.5 లక్షల బీమా పథకాన్ని కూడా రేవంత్ సర్కారు ఎత్తేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఆటోడ్రైవర్లకు నరకం చూపిస్తున్నారు.
వేల రూపాయల చలాన్లు వసూలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్కు గట్టిగ బుద్ధి చెప్తం. ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని వివరిస్తాం.