దుండిగల్: మరో మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారం డివిజన్, షాపూర్‌నగర్‌లోని ఎంజే గార్డెన్స్‌లో బీఆర్ఎస్ విప్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మరో మూడేండ్ల తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.