KP Vivekananda | చట్ట విరుద్ధంగా కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా సిట్ ఏర్పాటు చేశారు. వంద రోజుల్లో ఇస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతున్నారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్ ప్రశ్నించారు.
కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక్క మంచి పని చేసింది లేదు. కక్షపూరిత రాజకీయాలు చేయడమే సరిపోతుందని అన్నారు. పాలన గాలికి వదిలేసి మా నాయకులపై కేసులు పెట్టారుచట్ట విరుద్ధంగా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా సిట్ ఏర్పాటు చేశారు. వంద రోజుల్లో ఇస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్రాన్ని నిర్బంధంలో నడిపిస్తున్నారన్నారు బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద . అప్రకటిత ఎమర్జెన్సీ తలపించేలా పాలన ఉంది.చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారన్నారు.
కీలు బొమ్మగా మారిన పోలీసులు..
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఉంటారని ప్రభుత్వానికి తెలుసు. సిట్ అధికారులను కావాలని నందినగర్‌లో సిట్ నోటీసులు ఇచ్చారు. సజ్జనార్‌ను ప్రశ్నిస్తున్నమా పార్టీ నాయకుడు హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్‌లో నోటీసులు ఎలా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు కీలు బొమ్మగా మారారని వివేకానంద గౌడ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి చదువు కాదు సంస్కారం అవసరమని కేపీ వివేకానంద గౌడ్ చురకలంటించారు. రేవంత్ రెడ్డి గైడెన్స్ ప్రకారమే కేసీఆర్‌కు సిట్ నోటీసులు. వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా క్షేత్రంలోకి పోకుండా ఇలాంటి కుట్ర చేస్తున్నారని… రేవంత్ రెడ్డిది సంకుచిత ఆలోచన అని కేపీ వివేకానంద గౌడ్ మండిపడ్డారు.
హుందాగా రాజకీయాలు చెయ్యాలి. చట్టానికి లోబడి పోలీసులు పని చెయ్యాలన్నారు. ప్రభుత్వం వైఫల్యం సోషల్ ఎకనమిక్ సర్వేలో స్పష్టంగా బయట పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కావాలని ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా చేస్తున్నారు.రెండేళ్లగా విచారణల పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి కమిషన్లు , విచారణలు తప్ప చేసింది ఏం లేదు.కేసీఆర్ ఒక శక్తి, తెలంగాణ రాష్ట్రానికి ఒక మహానేత. అందరం కేసీఆర్ కు సంఘీభావంగా ఉన్నామన్నారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ,బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Live: BRS Leaders press meet at Telangana Bhavan.@kp_vivekanand @mkrkkpmla
https://t.co/fBqy3vtL77— BRS Party (@BRSparty) February 1, 2026