Bithri Sathi | కమెడియన్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.. మరోసారి వార్తల్లో నిలిచాడు. భగవద్గీతను కించపరిచేలా బిత్తిరి సత్తి వీడియో చేశాడని, ఆ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు మండిపడ్డారు. బిత్తిరి సత్తిపై వానరసేన సంఘం సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి క్షమాపణలు కోరాడు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆ వీడియోలో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని, ఎవరినీ కించపరచాలని చేయలేదు. నేను కూడా భగవద్గీతను ఆరాధిస్తాను. నేను చేసిన వీడియో వల్ల ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నాను అంటూ వీడియో ద్వారా బిత్తిరి సత్తి తెలిపారు.
భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై సారీ చెప్పిన బిత్తిరి సత్తి
తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఎవరినీ కించపరచాలని చేయలేదు. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ వీడియో ద్వారా తెలిపిన బిత్తిరి సత్తి. https://t.co/cWqRtGXTme pic.twitter.com/jIFRGbxhu7
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024
ఇవి కూడా చదవండి..
Naga chaitanya | 9వ క్లాస్‌లోనే అమ్మాయికి ముద్దుపెట్టిన నాగ చైతన్య.. వీడియో వైరల్
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!