Naga chaitanya Sobhita Dhulipala Engagement | టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లకు నిశ్చితార్థం జరిగింది. నటి సమంతకు 2021లో విడాకులు ఇచ్చిన నాగ చైతన్య మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. నాగచైతన్యకు శోభిత ధూళిపాళ్లకు మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలనే నిజం చేసి చూపించారు. అయితే చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరు అతడికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరూ అతడిని విమర్శిస్తున్నారు.
శోభిత ధూళిపాళతో రిలేషన్లో ఉండి సమంతను మోసం చేశావు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నాగ చైతన్య తాను ఇంతకుముందు కూడా ఇద్దరితో ఒకే టైంలో రిలేషన్లో ఉన్నానని.. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు. అయితే తాజాగా నాగ చైతన్య ఒక ప్లే బాయ్ అంటూ తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రానా హోస్ట్ చేసిన నెం.1. యారి ప్రోగ్రామ్కి వెళ్లిన నాగ చైతన్యను రానా నీ ఫస్ట్ కిస్ గురించి చెప్పు అంటాడు.
దీనికి నాగా చైతన్య సమాధానమిస్తూ.. 9వ క్లాస్లో ఒక అమ్మాయికి ముద్దు పెట్టాను అంటాడు. దీనికి పక్కనున్నా సుమంత్ షాక్ అవ్వగా.. రానా చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నావ్ కదరా అంటాడు. దీనికి చైతూ.. రిప్లయ్ ఇస్తూ.. అమాయకంగా ఉండడమే నాకు ప్లస్ అయ్యింది. రానా నీ ఫస్ట్ కిస్ ఎప్పుడురా 4వ క్లాస్లోనా అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Edo anukunna Silent aatagadive anna nv @chay_akkineni pic.twitter.com/AjvKjMOK9F
— T (@Ashtweetzzz) August 8, 2024
Also Read..