న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) లోక్సభలో మాట్లాడారు. ఈ బిల్లుపై ముస్లింలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. నిన్నటి రాత్రి వరకు కూడా ముస్లిం బృందాలు ఈ బిల్లు గురించి తనను కలిశారని, వక్ఫ్ బోర్డుల్లో మాఫియా రాజ్యమేలుతోందని కొందరు ఎంపీలు ఫిర్యాదు చేసినట్లు మంత్రి రిజిజు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు కొందరు ఎంపీలు వ్యక్తిగత సపోర్టు ఇచ్చారని, కానీ రాజకీయ కారణాల వల్ల ఆ విషయాన్ని వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. బిల్లు గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ లు, సంప్రదింపులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించినట్లు మంత్రి రిజిజు తెలిపారు. ఈ బిల్లుతో మతపరమైన సంస్థలో ఎవరి జోక్యం ఉండబోదన్నారు.
#WATCH | Speaking in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024, Minority Affairs Minister Kiren Rijiju says, “They (Opposition) are misleading Muslims…Till last night, Muslim delegations came to me…Many MPs have told me that the mafia has taken over Waqf boards. Some MPs have… pic.twitter.com/ibb9uJxDE1
— ANI (@ANI) August 8, 2024