హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వేల మంది అమాయక పెట్టుబడిదారులను బురిడీ కొట్టించి దాదాపు రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ఇ న్వాయిస్ డిసౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాకాలంగా పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు లుకౌట్ సర్యులర్ (ఎల్ఎసీ) జారీ చేశారు. ఆ క్రమంలో సోమవారం రాత్రి ఇరాన్ నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న అమర్‌దీప్‌ను అకడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న తెలంగాణ సీఐడీ బృందం ముంబై వెళ్లి అమర్‌దీప్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారం సహా మొత్తం రూ.43 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ప్రక్రియను ప్రారంభించారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేయడంతోపాటు అమర్దీప్ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ విమానాన్ని స్వాధీనం చేసుకొని వేలానికి పెట్టారు.