బాసర, జనవరి 6: నిర్మల్ జిల్లా బాసరలో నిత్యహారతి నిర్వహించే పూజారిపై గ్రామస్తుడు దాడిచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాసరకు చెందిన పూజారి సాయికళాధర్ ఆదివారం రాత్రి గోదావరి వద్ద నిత్యహారతి నిర్వహించి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే గ్రామానికి చెందిన రంజిత్ గోదావరి వద్దకు వచ్చి, పూజారిని దూషిస్తూ దాడికి దిగాడు. స్థానికులు ఆపే యత్నంచేసినా ఆగకుండా తలపై పిడిగుద్దులు గుద్దాడు. సాయికళాధర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు, సోమవారం రంజిత్‌పై కేసు నమోదు చేశారు. ఇది వ్యక్తిగత దాడి కావచ్చని స్థానికులు తెలిపారు.