KTR | కేసీఆర్‌ను మళ్లా మొలకెత్త నీయనని రేవంత్‌రెడ్డి అంటు న్నడు. కేసీఆర్‌ను మొలకెత్తనీయక పోవుడేంది? తెలం గాణనే మొలి పించిన మొగోడు.. మొనగాడు కేసీఆర్. ఆరు దశాబ్దాలు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెడి తే, మొలకెత్తనే మొలకెత్తదని విర్రవీగితే, మీరు కాదన్నా.. రాదన్నా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించి నోడు కేసీఆర్
-కేటీఆర్
వరంగల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేమెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, సీఎం కుర్చీ కోసం ఢిల్లీకి నెలకు రూ.100 కోట్లు కప్పం కడుతున్నాడని, రాహుల్ గాంధీకి మొత్తం రూ.6000 కోట్లు ఇస్తా నని ఒప్పందం చేసుకొని ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప రేవంత్‌రెడ్డికి మన్ను కూ డా తెల్వదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తిని తెలంగాణకు సీఎంగా చేసిన రాహుల్‌గాంధీని నడిబజారులో ఉరి తీయాలని ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మంగళవారం అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అడ్డగోలు హామీలిచ్చి రైతులను మోసం చేసినందుకు, నిరుద్యోగులకు నమ్మించి వంచించినందుకు రాహుల్‌గాంధీని నడిబజారులో ఉరితీయాలని మండిపడ్డారు. తెలంగాణను 60 ఏండ్లు రాచి రంపాన పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్న విషయం మరచిపోయి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దుర్మార్గం, తెలంగాణకు ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని ఛేదించి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన బూతుజాలంతో శాసనసభ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ‘జనగామ ర్యాలీలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్‌ను ఎప్పుడెప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలా? అన్న ఆరాటం వారిలో కనిపించింది’ అని చెప్పారు. ‘ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు ‘కసిదీరకుండగా బుసకొట్టుచుండాలె.. కాలంబు రాగానే కాంగ్రెస్‌ను కాటేసి తీరాలె’ అన్నంతగా ఉరకలెత్తే ఉత్సాహాన్ని ప్రజల్లో చూశానని తెలిపారు. సమర్థవంతమైన నాయకులున్న జనగామలో అద్భుత ఫలితాలు వచ్చాయని, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో 150 మంది సర్పంచ్‌లను గెలిపించుకోవడం మామూలు విషయం కాదని చెప్పారు.
సీఎం అంటే ఒర్రుడేనా?
‘సీఎం అంటే మొరుగుడు.. ఒర్రుడేనా? ముఖ్యమంత్రి అన్నాక నాలుగు మంచి మాటలుండొద్దా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ అయినా బయట అయినా ఒక్కటేనా? అని నిలదీశారు. ‘ఎట్లనో అట్ల మోసం చేసి గద్దెనెక్కినవ్. ముఖ్యమంత్రి సీట్ల కూసుకున్నవ్. మీ కాంగ్రెసోళ్లందరినీ తొక్కుడు తొక్కినవ్’ ఇంకేంది? హాయిగా క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుకుంట టైంపాస్ చెయ్.. ఆ ఒర్రుడేంది? ఆ సెక్యూరిటీ ఆఫీసర్లను కొట్టుడేంది?’ అని తూర్పారబట్టారు.

రాష్ట్రం తెచ్చిన మొగోడు కేసీఆర్
ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కిపెట్టినా.. తెలంగాణే రాదన్నా.. ఢిల్లీ మెడలు వంచి రాష్ర్టాన్ని మొలిపించినోడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. ‘నువ్వేంది కేసీఆర్‌ను మొలకెత్తనీయకపోయేది? నువు కేసీఆర్ కాలి చెప్పుధూళికి కూడా సరిపోవు’ అని నిప్పులు చెరిగారు. ‘ఇదివరకు ఒకడు ఉండె.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇయ్యాల ఎవరికైనా యాదున్నడా? గిట్లనే ఉంటరు.. పోతరు.. వీళ్లతోటి అయ్యేది లేదు.. పొయ్యేది లేదు.. ఊదుకాలదు..పీరిలేవదు’ అని దెప్పిపొడిచారు.
షాపుల ఉంటేనే కదా యాప్‌ల దొరికేది?
‘కేసీఆర్ రైతు.. రేవంత్ రియల్ ఎస్టేట్ బ్రోకర్’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. నాట్లేసే టైంకే రైతుబంధు, ఎరువులు..విత్తనాలను కేసీఆర్ అందించారని, ఇయ్యాల రాష్ట్రంలో ఎక్కడా యూరియా దొరక్క రైతులు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కొత్తగా యాపులు తెచ్చి రైతులపై రేవంత్ సర్కార్ పగతీర్చుకుంటున్నది. ‘ షాపుల యూరియా ఉంటేనే కదా యాప్‌ల దొరికేది? షాపుల లేదు.. యాప్‌ల లేదు. ఇప్పుడు కొత్తగా కార్డుల పేరు చెప్తున్నరు. గ్యారెంటీ కార్డులు అయిపోయిన్.. ఇప్పుడు యూరియా కార్డులా?’ అని నిలదీశారు.
అడ్డిమారి గుడ్డిదెబ్బల సీఎం అయినోడు
రేవంత్‌రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బల సీఎం అయ్యాడని కేటీఆర్ దెప్పిపొడిచారు. సీఎం సీటు కోసం ఢిల్లీకి నెలకు రూ.100 కోట్లు కడుతున్నాడని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డికి ఏవాగు ఎక్కడుందో తెల్వదు. వంక ఎక్కడుందో తెల్వదు. ఏ డొంక.. ఏ చెరువు ఎక్కడుందో తెల్వదు. గోదావరి ఎక్కడుందో తెల్వదు.. కృష్ణానది ఎక్కడుందో తెల్వదు’ అని దుయ్యబట్టారు. ‘ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటదని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పేర్కొనడమే తెలంగాణ దౌర్భాగ్యం’ అని వాపోయారు.
కడియంపై కేటీఆర్ నిప్పులు
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్రా లేకపోయినా.. ఉద్యమంలో ఏనాడూ ఏమీ చేయక పోయినా ఎంపీ అయిండు.. ఎమ్మెల్సీ అయిండు.. ఉప ముఖ్యమంత్రి అయిండు.. బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నడు. కానీ, పార్టీ కష్టకాలంలో ఉండంగనే తట్టా పారా పారేసి కాంగ్రెస్‌లో చేరిండు’ అని కడియం తీరుపై విరుచుకుపడ్డారు. ‘పెద్ద పెద్దనాయకులనేవారు బేకార్ అయినా.. ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లు అమ్ముడుపోయినా.. నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని పేర్కొన్నారు.

యూరియా కోసం లైన్లు కట్టాల్నా?
‘తెల్లారి లేస్తే పనికిమాలిన రోత కూతలు తప్ప రెండేండ్లలో రేవంత్‌రెడ్డి చేసి ఒక్క మంచి పని అయినా ఉన్నదా? ఆలోచించాలి’ అని ప్రజలను కేటీఆర్ కోరారు. ‘నేను పెంబర్తి నుంచి జనగామకు వస్తున్నప్పుడు ఎరువుల దుకాండ్లు ఎన్ని ఉన్నయి? ఎంత మంది రైతులు రోడ్ల మీదున్నరు? లెక్కబెట్టుకుంట వచ్చిన.. కేసీఆర్ పాలనలో రైతులు దర్జాగా బతికిండ్రు. ఆటో అన్నకు పైసలిస్తే ఎన్ని బస్తాలంటే అన్ని బస్తాలు బాయికాడ వేసి పోయేది.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి మళ్లీ ఎన్కటి రోజులే వచ్చాయని వాపోయారు. పాలిచ్చే బర్రెను ఇడిసిపెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నమని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
తెలంగాణ తెచ్చినందుకు ఉరితీయాల్నా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉరితీయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను ఉరితీసే అక్కెర ఏందని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఆరు దశాబ్దాల కల..నీ కాంగ్రెస్ పార్టీ 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు బలవంతపు పెండ్లి చేస్తే.. 1968లో 370 మందిని చంపితే.. 1971లో తెలంగాణ ప్రజలు గెలిపించిన 11 మంది ఎంపీలను కొనుక్కుంటే.. 2004లో మాట ఇచ్చి 2014 దాకా సావగొట్టి వెయ్యి మంది ప్రాణాలు తీస్తే.. వాటన్నిటీకి వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి చావునోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరితీయాల్నా? అని రేవంత్‌పై నిప్పులు చెరిగారు.
‘తెచ్చిన తెలంగాణలో 11 పంటలకు.. 70 లక్షలమంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చినందుకు ఉరితీస్తవా? భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఏ కారణంతో అయినా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా ఇచ్చినందుకా? రెండు సార్లు రుణమాఫీ చేసినందుకా? దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్-హర్యానాను తలదన్ని తెలంగాణను అగ్రభాగాన నిలిపినందుకా? 15 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ/షాదీముబారక్ ఇచ్చి పెండ్లిండ్లు జరిపించినందుకా? 15 లక్షల మంది గర్భిణులను ఇంటి నుంచి దవాఖానకు తీస్కపోయి మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే 13 వేల కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్లీ ఇంటికాడ దిగబెట్టినందుకా? ఊరూరా మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించి.. ఇంటికో నల్లా పెట్టించి కిలో మీటర్ల కొద్దీ మోసుకుంటూ నడిచే నరకయాతనను ఆడబిడ్డలకు శాశ్వతంగా దూరం చేసినందుకా? ఎందుకు ఉరితియ్యాలె?’ అని నిలదీశారు. ‘నిజానికి ఉరే తీయాల్సి వస్తే నడిబజారులో రాహుల్‌గాంధీని, రేవంత్‌రెడ్డిని ఉరితీయాలె’ అని నిప్పులు చెరిగారు.

19
బెదిరింపులకు భయపడొద్దు
‘మీరు కాంగ్రెస్‌ల చేరకుంటే పైసలియ్యం’ అని బెదిరిస్తే సర్పంచ్‌లు భయపడాల్సిన పనిలేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచ్‌లకు డైరెక్ట్‌గా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయని వివరించారు. ‘సర్పంచ్ల ఖాతాల్లోనే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి డబ్బులు పడ్తయి. అట్లా ఇప్పించే బాధ్యత మాది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోతం. కొట్లాడుతం. మీరెవరూ భయపడాల్సిన పనిలేదు’ అని పునరుద్ఘాటించారు. సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, పార్టీ నేతలు రాకేశ్‌రెడ్డి, ప్రేమలతారెడ్డి, జమునా, కృష్ణారెడ్డి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు
‘కుటుంబం అన్నంక సమస్యలు ఉంటయి. కొంత అక్కడక్కడా అలుగుడు గులుగుడు ఉంటది. లేకపోతే అది కుటుంబమే కాదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఒకింట్ల నలుగురు మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుంటం అంటే ఒకడు వంకాయ అంటడు.. ఒకడు బెండకాయ అంటడు.. ఉంటయి.. పంచాయితీలు. కానీ, ఇంట్లది ఇంట్ల అనుకోవాలె. కలిసి బువ్వతినాలె. కలిసి కొట్లాడాలె. గట్లనే ఏమన్నా గులుగుడున్నా. అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకనే ఉండాలె’ టికెట్ ఇచ్చినంక ‘గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే’ అన్నట్టు ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘అసలే ప్రతిపక్షంలో ఉన్నం. మన గులుగుడు..అలుగుడుతోని కాంగ్రెస్, బీజేపోళ్లకు సందియ్యద్దు’ అని సూచించారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీసీటీ ఎన్నికల్లో బీఫాం ఎవరికి ఇచ్చినా కేసీఆరే అనుకొని ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లనే పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలిపించారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్యను తప్పుకోండని పార్టీ చెప్తే వారు క్రమశిక్షణ కలిగిన సైనికులుగా పనిచేస్తున్నారని, వారి స్ఫూర్తితో గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు.
రాహుల్ మాటలు నమ్మి మోసపోయిన యువత
‘రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి.. ‘కేసీఆర్.. కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి.. మొదటి సంవత్సరంలోనే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా’ అని డైలాగులు కొట్టి ఇప్పుడేం చేస్తున్నడు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రాహుల్ మాటలను మా తమ్ముళ్లు, చెల్లెళ్లు నమ్మి పల్లెలకు.. ఇండ్లండ్లకు పోయి మాకు ఉద్యోగాలు రావాల్నంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యిండ్రి’ అని బతిలాడిండ్రు. అట్ల చెప్పడం వల్ల పాలకుర్తి లాంటి నియోజకవర్గంలో ఏడుసార్లు గెలిచిన దయాకర్‌రావు లాంటి వాళ్లు ఓడిపోయిండ్రు’ అని పేర్కొన్నారు. పాలకుర్తి అభివృద్ధిలో దయాకర్‌రావు ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. రాహుల్ మాటలు నమ్మిన పిల్లలు ఈరోజు మోసపోయామని బాధపడుతున్నారని వాపోయారు. రూ. 2,500 ఇచ్చే చేతగాదు కానీ మహిళలను రేవంత్‌రెడ్డి కోటీశ్వరులను చేస్తాడా? అని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బెదిరింపులు,
భయభ్రాంతులతో గూండారాజ్ నడిపిస్తున్నది. ఆ గూండారాజ్‌ను ఛేదిస్తూ పల్లెల్లో బీఆర్ఎస్ సైనికులు పనిచేస్తున్నరు. కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా వెరువకుండా కాంగ్రెస్ గూండాగిరీకి ఎదురు నిలుస్తున్నరు. ఆరు గ్యారెంటీలు ఏవని కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీసి అడిగిన బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులను సర్పంచ్‌లుగా ప్రజలు గెలిపించుకోవడం అసాధారణ విజయం.
-కేటీఆర్
కాంగ్రెసోళ్లను నమ్మిన పాపానికి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. యూరియా కోసం చలికాలంలో రాత్రనకా పగలనకా లైన్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. మధ్యాహ్నం తిండికి పోవాల్నంటే చెప్పులు పెట్టి, రాళ్లు పెట్టి, రాళ్లకింద ఆధార్‌కార్డులు పెట్టి దేవుడికి దండంపెట్టి..‘నేను వచ్చేదాకా నా జాగ కాపాడుస్వామీ’ అని మొక్కుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.
-కేటీఆర్
పటాకులు పేలినట్టు.. చెక్‌డ్యామ్‌లు పేలుతున్నా కండ్లప్పగించి చూస్తున్న రేవంత్‌రెడ్డి మనకు నీళ్ల గురించి చెప్తడట! కృష్ణా, గోదావరి నీళ్ల గురించి చెప్తడట! 65 ఏండ్లు తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెసోళ్ల తరఫున చెప్తడట! ఆయన చెప్తే మనం ఇనాల్నట! గాయింతదానికి
మేం కూసోవాల్నట!
-కేటీఆర్
కుటుంబం అన్నంక సమస్యలు ఉంటయి. కొంత అక్కడక్కడా అలుగుడు గులుగుడు ఉంటది. లేకపోతే అది కుటుంబమే కాదు.
పంచాయితీలున్నప్పుడు ఇంట్లదింట్ల అనుకోవాలె. కలిసి బువ్వతినాలె. కలిసి కొట్లాడాలె. గట్లనే ఏమన్నా గులుగుడున్నా.అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకనే ఉండాలె.. టికెట్ ఇచ్చినంక గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అన్నట్టు ఉండాలె.అసలే ప్రతిపక్షంలో ఉన్నం. మన గులుగుడు..అలుగుడుతోని కాంగ్రెస్, బీజేపోళ్లకు సందియ్యద్దు.
-బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచన