ముంబై: వెనెజువెలాలో ఏం జరిగిందో మన దేశంలో కూడా జరిగితే? అంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ సోషల్ మీడియాలో లేవనెత్తిన సందేహంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు చవాన్ వ్యాఖ్యలను ఖండించారు. మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనను చవాన్ ప్రస్తావిస్తూ వెనెజువెలాలో ఏం జరిగిందో అదే భారత్‌లో జరిగితే? మన ప్రధానమంత్రిని కూడా ట్రంప్ కిడ్నాప్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై జమ్ము కశ్మీరు మాజీ డీజీపీ శేష్ పాల్ వేద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు యావద్దేశాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. కాగా, చవాన్ వ్యాఖ్యలపై మరికొందరు యూజర్లు స్పందిస్తూ చవాన్‌ను బ్రెయిన్ డెడ్, అజ్ఞాని, పిచ్చితనం వంటి పదాలతో ఎద్దేవా చేశారు.