DSP Siraj | పోలీస్ యూనిఫామ్‌లో సిరాజ్.. డీఎస్పీ హోదాలో డీజీపీతో భేటీ..!
DSP Siraj : టీ20 వరల్డ్‌కప్ హీరో మొహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) పోలీస్ యూనిఫామ్ ధరించాడు. డీఎస్పీ హోదాలో తొలిసారి డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశాడు.
DSP Siraj : టీ20 వరల్డ్‌కప్ హీరో మొహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) పోలీస్ యూనిఫామ్ ధరించాడు. మైదానంలో బంతితో నిప్పులు చెరిగే ఈ స్పీడ్‌స్టర్.. డీఎస్పీ హోదాలో తొలిసారి డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశాడు. సోమవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సిరాజ్ మర్యాదపూర్వకంగా సీవీ ఆనంద్‌తో భేటీ అయ్యారు. అనంతర తన 73వ నంబర్ జెర్సీని డీజీపీ బహూకరించాడు.
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన సిరాజ్ భారత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. పొట్టి ప్రపంచకప్ 2024లో టీమిండియా విజయంలో సిరాజ్ పాత్రను కొనియాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడిని డీఎస్పీగా నియమించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో తొలిసారి యూనిఫామ్‌లో సిరాజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఇరువురు క్రికెట్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం సిరాజ్ తన 73వ నంబర్ జెర్సీని సీవీ ఆనంద్‌కు కానకగా ఇచ్చాడు.
DSP Mohammed Siraj meets Telangana DGP C.V. Anand in Hyderabad. 🤝👮♂️#MohammedSiraj #Cricket #Police #Sportskeeda pic.twitter.com/La6It7FYTf
— Sportskeeda (@Sportskeeda) July 20, 2026
ఓవల్ హీరో..
నిరుడు ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్‌తో మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో అద్భుత బౌలింగ్కుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డు అందుకున్నాడీ స్పీడ్‌స్టర్. ఆగస్టు నెలకుగానూ అతడికి ఈ గౌరవం లభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు.

తన ఫిట్నెస్తో పాటు చెక్కుచెదరని ఏకాగ్రతతో అందరి ప్రశంసలు అందుకున్న మియా భాయ్.. నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో నిప్పులు చెరిగాడు. బుమ్రా గైర్హాజరీలో పేస్ దళం బాధ్యతలను భుజాన వేసుకున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

