కోదాడ, జూలై 20 : నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రశ్న పత్రాల లీకులతో విద్యార్థుల ఉన్నత భవిష్యత్ ఉన్నత భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. మానసిక వేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఇది కేంద్ర ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ అంశంపై జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రామన్ మెగాసే అవార్డు గ్రహీత వాంగ్చుక్ దీక్షకు తమ మద్దతును ప్రకటించారు. ఈ ర్యాలీలో బంగారు నాగమణి, ముత్తవరపు రామారావు, రాపర్తి రామనర్సయ్య, పంది తిరపయ్య, పాకనాటి రాఘవరెడ్డి, ఎస్.శ్రీనివాసరావు, జె ఆర్ కె మూర్తి, గుండెపంగు రమేష్, భద్రారెడ్డి హరికిషన్, పెయింటర్ బాబు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.