తుంగతుర్తి, జూలై 20 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కేజీవీబీ పాఠశాల, ఎంఆర్సీలో పని చేస్తున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి, తుంగతుర్తి మండల అధ్యక్షుడు మల్లెపాక రవీందర్ మాట్లాడుతూ.. కేజీబీవీ,యుఆర్ఎస్ అలాగే, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించడం కోసం ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగిందన్నారు.
KGBV/URS/SSA ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలాగే నాన్ టీచింగ్ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగాసెలవు సౌకర్యాలు కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంట్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కేర్ టేకర్లను నియమించాలని,సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని మొదలగు డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా సమస్యలు విన్నవించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు చిత్తలూరి రాజేష్, దార సరిత, కాసనబోయిన మల్లయ్య, దేశపంగు జ్యోతి, ఐఈఆర్పీ గుండగాని ఉపేందర్, మెసెంజర్ మద్దికుంట్ల వెంకన్న, పిటిఐలు మద్దికుంట్ల శ్రీనివాస్, కోట ప్రశాంతి, రమ, కిన్నెర కిరణ్ బాబు, కేజీబీవీ సిబ్బంది సిఆర్ టిలు సాల్మ, దుర్గభవాని, రమాదేవి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ రేణుక, మై భూమి, వెంకటలక్ష్మి గౌస్య, ఉమామహేశ్వరి, సమత పాల్గొన్నారు.