తుంగతుర్తి, జూలై 20 : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బొంకూరి అరుణ చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తోంది. ఆమె సుమన్ షాడో కరాటేలో ప్రత్యేక శిక్షణ పొందింది. గడిచిన ఐదు సంవత్సరాలుగా తుంగతుర్తిలో ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తూ వస్తోంది. ఏప్రిల్ 26న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అత్యుత్తమ ప్రదర్శన కనరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.