IPS Trainee | మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో రిలేషన్లో ఉన్నా.. సూసైడ్ నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి
IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్లో కీలక అంశాలను వెల్లడించాడు.
IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించగా.. అతడు ప్రస్తుతం ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్య యత్నానికి ముందు తన తప్పేమీ లేదని ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్డడం చర్చనీయాంశంగా మారింది.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్లో కీలక అంశాలను వెల్లడించాడు. లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో తాను రిలేషన్లో ఉన్నానని లేఖలో రాశాడు. మహిళా ట్రైనీతో ఏడాదిగా రిలేషన్లో ఉన్నా.. తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్లీ నా రూంకి వచ్చింది.. దీంతో మళ్లీ మా రిలేషన్ కొనసాగింది. దీనికి సంబంధించి నా దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. నా చావుకు నలుగురు కారణమంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో పేర్కొనడం సంచలనం రేకెత్తిస్తోంది.
తనను లైంగికంగా వేధిస్తున్నాడని..
తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలిసిందే. ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతోపాటు వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొంది.
ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Hyundai | హ్యుందాయ్ చార్జింగ్ టెన్షన్స్‌కు చెక్.. అందుబాటులోకి మరిన్ని చార్జింగ్ పాయింట్లు
TTD | టీటీడీ విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
Skin Health | చర్మం సురక్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

