Naga Chaitanya – Sobhita Dhulipala | టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్నారు. ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను అతను వివాహం చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా నేడు ఉదయం 9.42 గంటలకు నాగార్జున నివాసంలో ఈ జంటకు సింపుల్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
శోభిత ధూళిపాళతో మా కుమారుడు నాగచైతన్య నిశ్చితార్థం ఇవాళ ఉదయం 9:42 గంటలకు జరిగింది. శోభిత ధూళిపాళను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో జీవించాలి. ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.. అంటూ నిశ్చితార్థం విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు నాగార్జున. కొత్త జంటతో నాగార్జున ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లిపై కొందరూ నాగ చైతన్యకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరూ సమంతను నాగ చైతన్య మోసం చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యకు ప్రపోజ్ చేసిన ఆగష్టు 8వ తేదీనే మళ్లీ చైతూ రెండో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై కూడా చైతూ మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ-శోభిత జంటపై రూమర్స్ వచ్చాయ్. ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫ్మామ్ అవ్వడంతో ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారింది.
#SamanthaRuthPrabhu Proposed Naga chaitanya On August 8 💔
And He Is Now Getting Enggaged With #SobhitaDhulipala On August 8 💞#NagaChaitanya ..! pic.twitter.com/6Om7YnL2Gb
— ꪆࣼꪒവᰢ͟།ᰈ།ໍ (@itz_sagaa) August 8, 2024
Also Read..