25న పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం బహిరంగ సభ
ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు
సిటీబ్యూరో, నవంబరు 21(నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయం త్రం టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్‌తో కలిసి పరేడ్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణంలోకి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్‌కు 24 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు మేలు: తలసాని
బేగంపేట్, నవంబర్ 21: తెలంగాణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలోని గైదిన్బాగ్కు చెందిన రషీద్, షఫీ, అశ్విక్ల ఆధ్వర్యంలో 25 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందినదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచే కాకుండా విద్యావంతులు రిటైర్ట్ ఉద్యోగులు కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. కార్యక్రమం లో రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

