జవహర్‌నగర్, అక్టోబర్ 19: సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు అడుగు ముందుకు దాటడం లేదు. ఇందుకు నిదర్శనమే జవహర్‌నగర్ కార్పొరేషన్ బీజేఆర్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిలుస్తుంది. సౌకర్యాల లేమితో ఇప్పటికే విద్యార్థులు పాఠశాలకు రావడం లేదు. ఒకే ఉపాధ్యాయుడు.. 80మంది విద్యార్థులకు చదువును బోధించడం కష్టతరమవుతుంది.
దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. జవహర్‌నగర్ కార్పొరేషన్లో పూర్తిగా పేద ప్రజలే నివస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్కారు బడికి పంపుతుంటే.. ఉపాధ్యాయులు లేకపోవడంతో చిన్నారులు చదువులో వెనుకబడుతున్నారని వి ద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. కలెక్టర్, డీఈవో వెంటనే చర్యలు తీసుకుని ఉపాధ్యాయులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.