Karne Prabhakar | మా కాంగ్రెస్ హయాంలో 34 కిలోమీటర్లు పూర్తి చేసినం. మీకు 10 కిలోమీటర్లు మిగిలి ఉండే పూర్తి చేయలేదు. నేను ఎస్ఎల్బీసీ పూర్తి చేసి 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.
ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అదే ఉపన్యాసంలో చివరన వచ్చే ఎన్నికల కంటే ముందే ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నీళ్లిస్తా అని అంటున్నడు. ఒక్క ఉపన్యాసంలోనే మొదటికీ, చివరికీ.. అంటే సీఎం రేవంత్ రెడ్డి మెదడుకు, పెదాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నడని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నడో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నడని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఇవాళ తెలంగాణలో ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు తిరిగి కోరుకుంటున్నరు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకో అంటున్నరు . అన్నా ఎప్పుడొస్తవ్ కేసీఆర్ మాకు అండగా నువ్వే అని చెప్పి రైతాంగం ఎదురుచూస్తోంది. ఆ విషయం అర్థమై ఈ మధ్య వస్తున్నటువంటి అనేక సర్వేల్లో మైండ్ బ్లాంక్ అయి మెదడు దొబ్బి మొదటి ప్రసంగంలోనేమో ఎస్ఎల్బీసీ పూర్తయిందట.. ఆయన నీళ్లిస్తున్నడట అని కర్నె ప్రభాకర్ అన్నారు.
దురదృష్ణమేందంటే కనీసం 100 మీటర్లు కూడా కంప్లీట్ కాకముందే సొరంగం కూలిపోయి ఇంకా 8 శవాలు అక్కడే ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల మా హయాంలో దాదాపు 11 కిలోమీటర్లు పూర్తి చేసి.. ఎస్ఎల్ బీసీ జీవితకాలపు సొరంగంగా మారిస్తే.. అది ఒక పెండింగ్ ప్రాజెక్టుగా మీరు పక్కకు పడేస్తే.. మేం పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తే నువ్వొచ్చినంక కేవలం 100 మీటర్లు కూడా పూర్తిచేయలేదుకదా.. దీంతోనే నీ అబద్దాలేందో చాలా స్పష్టంగా కనిపిస్తున్నయని కర్నె ప్రభాకర్ అన్నారు.
ఎస్ఎల్బీసీ పైన మెదడుకు, మూతికి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.
ఈ రెండున్నరేళ్లలో వంద మీటర్లయినా సొరంగం తవ్వావా?
సొరంగం కూలిపోయిన ఘటనలో కార్మికుల శవాలు ఇంకా ఆ సొరంగంలోనే ఉన్నాయి.తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కేసీఆర్ గారు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.… pic.twitter.com/cWuLNfBch7
— BRS Party (@BRSparty) June 29, 2026