కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సన్నిహితుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశీష్ బెనర్జీ ఆదివారం తెల్లవారు జామున బీర్భూమ్ పార్టీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే ఈ ఆఫీసు ఉంది. అక్కడే ఒక సూసైడ్ నోట్ కూడా రాసి ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని.. స్పీకర్గా ఉన్నప్పుడు, తారాపీఠ్ రాంప్రూహాట్ డెవలప్మెంట్ అథారిటీ (టీఆర్డీఏ)కు సంబంధించిన అవకతవకల్లో తనపై అసత్య ఆరోపణలు చేశారని సూసైడ్ లెటర్లో ఆయన రాసుకొచ్చారు.
వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పు అంటూ ఆశిష్ తెలిపారు. ఆయన ఆత్మహత్య విషయం తెలుసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాంపూర్హాట్ నియోజకవర్గం నుంచి ఆశిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విద్యా, వ్యవసాయశాఖల మంత్రిగా పనిచేశారు. 2021లో బెంగాల్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 2026లో బీజేపీ నేత ధ్రుప సాహా చేతిలో ఓడిపోయారు.