హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. కేరళలోని (Kerala) వయనాడ్(Wayanad) పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ రోజు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానంతో పాటు వయనాడ్ స్థానంలో పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు.
రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలిపారు. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఇవి కూడా చదవండి..
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్