KTR | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టిండు : కేటీఆర్
KTR | రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టిండు. ఇవాళ రియల్ ఎస్టేట్‌ను ఏం చేసిండు మరి.. బొంద పెట్టిండు.. వంద ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | ప్రభుత్వం లేదు.. పవర్ లేదు కానీ గర్వంగా ఎక్కడనిపిస్తుందంటే ఎమ్మెల్యే పోయినా.. ఎంపీ పోయినా.. అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇక్కడికొచ్చి మీరు చేస్తున్న ప్రకటన మామూలు ప్రకటన కాదు.. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీ గుండెల్లో రైళ్లను ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనిపిస్తుందని చేవెళ్ల సమావేశాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు మనకు అధికారం పోయి రెండున్నరేళ్లయింది. ఎన్నికల ముందేమో నేను గుంపు మేస్త్రీని. రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టిండు. ఇవాళ రియల్ ఎస్టేట్‌ను ఏం చేసిండు మరి.. బొంద పెట్టిండు.. వంద ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిండని మండిపడ్డారు.
మన ప్రభుత్వం, పెద్దలు కేసీఆర్ ఉన్నప్పుడు షాబాద్‌లో చందన్ వెల్లిలోకానీ, సీతారాంపూర్‌లో కానీ ఎకరం 30 లక్షలుండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఒక మెక్రోసాఫ్ట్, అమెజాన్ వెల్స్ఫన్ ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత నేడు ఎకరం ౩ కోట్లకు తక్కువ షాబాద్‌లో లేని పరిస్థితి ఉంది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లందరూ ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.
వాస్తవేంటంటే ఎన్నికలకు ముందు ఎకరం కోటి రూపాయలు పలికింది కూడా ఇవాళ కనీసం రూ.50 లక్షలు, రూ.60 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ సిద్దంగా లేరన్నారు. దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకీ పరిస్థితి ఉందనేది మనం ఆలోచన చేసుకోవాల్సి ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.
Live: చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంhttps://t.co/DRlaVZrpCT
— BRS Party (@BRSparty) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

