Ram Chander Rao | తుమ్మిడిహట్టి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశానని తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి చర్చిద్దాం అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించడం లేదు.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా దీనిపై టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒక అబద్దమాడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దగ్గర టైం తీసుకోవడం లేదన్నారు. అసలు మీరు సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ దగ్గర టైం తీసుకున్నరా.. అని ప్రశ్నించారు. నిన్న దేవేంద్ర ఫడ్నవిస్ ఆఫీస్‌కు ఫోన్ చేశా. ఒక నెల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కోసం అపాయింట్ మెంట్ అడిగారు.. దేనికోసమే తెలియదు. అక్కడ దేవేంద్ర ఫడ్నవిస్ దగ్గర తెలంగాణకు సంబంధించి ఎలాంటి రిక్వెస్ట్ లేదు. వీళ్లు అడగలేదు.. సీఎం అపాయింట్ మెంట్ కిషన్ రెడ్డి అడగాలట అని చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి అసలు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ అడగలేదు – టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు https://t.co/ugBUpwHJOu pic.twitter.com/SsqUrSbAYQ
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే..?
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి చర్చిద్దాం అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు
– రేవంత్ రెడ్డి https://t.co/6GSisHjE7S pic.twitter.com/MfQoJgfOf3
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు