కుత్బుల్లాపూర్ : ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశాల మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గంధం సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, కాలే నగేష్, గుమ్మడి మసూదన్ రాజు, ఎల్లా గౌడ్, తోకల నగేష్ రెడ్డి, నదీమ్ రాయి, ఏసు తదితరులు పాల్గొన్నారు.