రామచంద్రాపురం, అక్టోబర్ 5: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు మద్దతు తెలిపి మరోసారి ఆశీర్వదించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం కొల్లూర్‌లోని కేసీఆర్ టౌన్షిప్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్ట, బహదుర్‌పుర, యాకుత్‌పుర నియోజకవర్గాలకు చెందిన 7,241 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించారన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్‌కు దీటుగా సకల సౌకర్యాలతో గృహాలు నిర్మించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ర్టానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్సీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సంగ్రంరెడ్డి, ఉప తహసీల్దార్ విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.