అంగరంగవైభవంగా తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కళ్యాణం
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు విచ్చేసి పూజలు చేశారు.
- హజరైన సీఎం కేసీఆర్ దంపతులు


నిజామాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు విచ్చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వామివారికి రెండున్నర కిలోల బంగారు కిరీటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అక్కడే కొండ కింద ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ప్రసంగించారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక మీదట ఎండిపోయే పరిస్థితే ఉత్పన్నం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్‌కు నీటి గోస తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌తో పాటు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు స్వామి వారి ప్రసాదాన్ని అందజేస్తున్న అర్చకులు

స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు

స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులుబ్రహ్మోత్సవాల్లో… ఎంపీ సంతోష్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, విప్ గంప గోవర్ధన్, ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Attend
- BRS leaders
- CM KCR
- kalyanam
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

