శనివారం 24 అక్టోబర్ 2020
Hyderabad - Aug 21, 2020 , 00:27:33

మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి

మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌: వినాయక ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో సహకరించాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ కోరారు. సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నానాటికి విస్తరిస్తున్న నేపథ్యంలో వినాయక ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.


logo