అన్ని వార్డు కార్యాలయాల్లో.. ఉచితంగా గణపయ్యలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలతో కలిసి 4.64 లక్షల మట్టి విగ్రహాలను అన్ని వార్డు కార్యాలయాల ఆవరణలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్లో 66,500, చార్మినార్ జోన్లో 93,600, ఖైరతాబాద్ జోన్లో 80,100, శేరిలింగంపల్లి జోన్లో 42,900, కూకట్పల్లి జోన్లో 58,600, సికింద్రాబాద్ జోన్లో 76,500 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా హెచ్ఎండీఏ ద్వారా 79,200, పీసీబీ ద్వారా 75,000, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 46వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ కోటేశ్వర రావు, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజా తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ..
పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలను తయారు చేయించిన హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నది. శుక్రవారం నగరంలో 20 చోట్ల 20వేల విగ్రహాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో హెచ్ఎండీఏ ఈఈ అప్పారావు హైకోర్టు ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్తో పాటు పలు చోట్ల వేలాది మంది మట్టి విగ్రహాలను తీసుకొని పూజించేందుకు ముందుకు వచ్చారని, ప్రతి ఏటా లక్ష మట్టి విగ్రహాల పంపిణీలో భాగంగా ఈ ఏడాది లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మట్టివిగ్రహాలనే ప్రతిష్టించి పూజలు నిర్వహించేలా అవగాహన కల్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

