నకిలీ పాస్‌పోర్ట్ కేసులో.. ముగిసిన నిందితుల కస్టడీ
నకిలీ పాస్‌పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ర
- విదేశాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్న సీఐడీ
- సీఐడీ అదుపులో మరో నలుగురు
- స్పెషల్ బ్రాంచ్ పోలీసుల హస్తంపై ఆరా..!
- అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేస్తూ.. లుకౌట్ నోటీసులు జారీ
నాంపల్లి కోర్టులు, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : నకిలీ పాస్‌పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ సమయంలో నిందితుల నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా నకిలీ పాస్‌పోర్టులపై విదేశాలకు వెళ్లినవారి వివరాలను కూడా సేకరించారు. పాస్‌పోర్టులు ఇప్పించడంలో స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన అధికారుల హస్తం కూడా ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని గుర్తించారు. నకిలీపాస్ పోర్టులను రద్దుచేయాలని కోరుతూ ఇప్పటికే ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి సీఐడీ అధికారులు లేఖ రాశారు.
దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేస్తూ.. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. చెన్నైకి ఏజెంట్ మురళీధరన్, హైదరాబాద్‌కు చెంది న సత్తార్ నకిలీ పత్రాలు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారని, వీరిద్దరూ ప్రధాన నిందితులు కావడంతో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించారు. నకిలీ పాస్‌పోర్టు రాకెట్‌ను గుర్తించేందుకు సీఐడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 92 అక్రమ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురిని కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మ రం చేసింది. నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

