Kidnap Case | ఓ బాలుడిని కిడ్నాప్ కేసు చేధించే క్రమంలో అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టైంది. అక్రమంగా శిశువులను విక్రయిస్తున్న ముఠా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రాంతంలో నాగరాజు అలియాస్ మురుగన్ అనే వ్యక్తి ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, అధిక డబ్బుల కోసం శిశు విక్రయ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు.
మురుగన్ ఈ నెల 6వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో దేవ్ అనే బాలుడిని కిడ్నాప్ చేశాడు. దేవ్ కేసు దర్యాప్తులో ఉండగా ఈ కిడ్నాప్ వెనుక తెలంగాణకు చెందిన ముఠా ఉన్నట్టు గుర్తించిన గుజరాత్ పోలీసులు మురుగన్(నాగరాజు)ను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణకు చెందిన ముఠా సంతానం లేని దంపతులకు రూ.5 లక్షల చొప్పున శిశువులను విక్రయిస్తున్నట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు.
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!