మారేడ్‌పల్లి, జూన్ 20: రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2,98,000 విలువజేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన అభయ్ రాజ్‌సింగ్(28), అదే ప్రాంతానికి చెందిన మిథిలేష్ గిరి(20) వీరిద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు స్నేహితులు కావడంతో నిత్యం మద్యం సేవించడం, జూదం, ధూమపానం చెడు అలవాట్లకు బానిసయ్యారు.
వీరు సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు రైళ్లలో(4 కేసుల్లో) చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. శుక్రవారం నిందితులు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదస్థితిలో తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా..చేసిన నేరాలను అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రైల్వే పోలీసు సిబ్బందిని రైల్వే డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అభినందించారు.