Hyderabad | హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గురువారం మధ్యాహ్నం ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద సెంట్రింగ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్లాబ్ కింద ఉన్న 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాద ఘటనతో స్థానికులు, ఇతర కార్మికులు అప్రమత్తమయ్యారు. సెంట్రింగ్ కింద ఉన్న కార్మికులను బయటకు లాగారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లోపు పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుప్పకూలిన సెంట్రింగ్‌ను డీఆర్ఎఫ్ బృందాలు పక్కకు తొలగించాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Rachakonda | నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం : రాచకొండ సీపీ
Hyderabad | రాజేంద్రనగర్‌లో కొనసాగుతున్న హైడ్రా తరహా కూల్చివేతలు
Making Curd | చలికి పెరుగు సరిగా తోడుకోవట్లేదా.. ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్..!