బంజారాహిల్స్,నవంబర్ 8 : మంత్రుల నివాసంలో(Minister quarters) పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి పీఏ సెల్‌ఫోన్(Cell phone) చోరీకి గురయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్వార్టర్ నెంబర్ 7లో గత నెల 31న దీపావళి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు అక్కడకు వచ్చిన అతడి పీఏ సతీష్‌కుమార్ పూజలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు తన జేబులో చూసుకోగా తన ఫోన్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ-35 ఫోన్ కనిపించలేదు. పెద్దసంఖ్యలో విజిటర్స్ రావడంతో వారిలో ఎవరైనా సెల్‌ఫోన్ కొట్టేసి ఉంటారని బాధితుడు సతీష్‌కుమార్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.