హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. హైడ్రా పేరుతో సెటిల్మెంట్ చేసే అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి ఫిర్యాదు అందినట్లు చెప్పారు.
హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా..వెంటనే వారికి ఎక్నాలజిమెంట్ ఇస్తున్నామన్నారు. అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదుపై చర్యలు ప్రారంభించామన్నారు. మ్యాన్హాట్ వాళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో డంపింగ్ చేశారన్నారు. గూగుల్ మ్యాప్స్‌లో ఆక్రమించినట్లు కనిపించడం లేదన్నారు. అయిన విచారణ చేస్తున్నామని చెప్పారు. అకడ వేసిన డంప్‌ను తొలగించమని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కేవలం వంశీరామ్ మాత్రమే కాదని..ఆదిత్య,రాజ్ పుష్ప లాంటి బిల్డర్స్ కూడా డంపింగ్ చేశారన్నారు. వారిని కూడా అక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.