Hyderabad | బంజారాహిల్స్, మే 8: పెట్రోల్ పోయించుకుని బిల్లు చెల్లించకుండా ఉడాయించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం-5లోని దేవరకొండ బస్తీలో నివాసం ఉంటున్న అనికేత్ కుమార్(23) అనే యువకుడు బంజారాహిల్స్ రోడ్ నెం-3లోని ఆస్కి పక్కనున్న పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంటాడు.
ఈనెల 4న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అనికేత్ డ్యూటీలో ఉండగా నలుగురు యువకులు రెండు డ్యూక్ బైక్‌ల మీద అక్కడకు చేరుకున్నారు. ఒక బైక్‌లో ఆరు లీటర్ల పెట్రోల్ పోసుకోగా, మరో బైక్‌లో రూ.1000 విలువైన పెట్రోల్ పోయించుకున్నారు. బిల్లు ఇవ్వాలని క్యాషియర్‌ను కోరగా బిల్లు రాస్తున్న సమయంలో బైక్‌ల మీద ఉన్న యువకులు వేగంగా పారిపోయారు. ఈ మేరకు బాధితుడు అనికేత్ కుమార్ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 318(4),316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.