బంజారాహిల్స్, నవంబర్ 1: అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్కు బయట ప్రహరీని, గ్రిల్స్‌ను ఢీకొట్టింది.బంజారాహిల్స్ రోడ్ నం. 6లో నివాసముంటున్న ఉత్సవ్ దీక్షిత్ (33) ప్లాస్టిక్ కంపెనీకి ఎండీగా ఉన్నాడు. శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో ఫిలింనగర్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నం. 10 వైపునకు కారులో వేగంగా వస్తున్నాడు.
కళింగ చౌరస్తా నుంచి క్యాన్సర్ అస్పత్రి వైపునకు వెళ్తున్న కారు యూటర్న్ సమీపంలో ప్రమాదరకమైన మలుపు వద్ద అదుపు తప్పింది. అతివేగంగా వస్తూ ఎడమవైపు ఉన్న ఫుట్‌పాత్ మీకు ఎక్కడంతో పాటు కేబీఆర్ పార్క్ బయట జీహెచ్ఎంసీ వాక్కే చెందిన ప్రహరీని, గ్రిల్స్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా గాల్లోకి ఎగిరి భారీ వృక్షాన్ని ఢీకొట్టి అగిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కాగా, బెలూన్లు తెరుచుకోవడంతో ఉత్సవ్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.