హైదరాబాద్ : షేక్ ఉస్మాన్(20) హత్య కేసులో(Brutal murder) మరో కోణం వెలుగు చూసింది. ఉస్మాన్ని హత్య చేస్తాం అని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని పోలీసులకు కుటుంబసభ్యులు ముందే ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు లు సకాలంలో స్పందించి పట్టించుకుంటే ఉస్మాన్ ప్రాణాలతో బయటపడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, బేగంపేట(Begumpet) పరిధిలోని పాటిగడ్డలో ఈ హత్య చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి యువకుడిని హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది. తన మరద లితో తిరుగుతున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడు. వివరా ల్లోకి వెళ్తే.. బేగంపేటలోని పాటిగడ్డ ప్రాంతానికి ఉస్మాన్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
ఈ వ్యవహారం యువతి బావ అజాజ్‌కు నచ్చలేదు. దాంతో అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు. నలుగురూ మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచి చంపారు. దాంతో అతడు అక్కడి కక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం నిందితులు నలుగురు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.
పోలీసులకు ముందే చెప్పినా రక్షణ కల్పించలేదు
హైదరాబాద్ బేగంపేటలో యువకుడి దారుణ హత్య
బేగంపేటలో నివాసముండే షేక్ ఉస్మాన్(20) అనే యువకుడిని నిన్న రాత్రి అతని ఇంటి వద్ద ఉండే కొందరు వ్యక్తులు హత్య చేసారు …
ఉస్మాన్ ని హత్య చేస్తాం అని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారు అని పోలీసులకు… https://t.co/3t98WRgqKE pic.twitter.com/R8KHRvj7Vf
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2024