హైదరాబాద్ : లోక్ సభలో తెలంగాణరాష్ట్ర ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ బిజెపి ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీ కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ కార్యాలయం ఎదుట తేజస్వి చిత్ర పటాన్ని దహనం చేశారు. బీఆర్ఎస్వీ , బీజేవైఎం విద్యార్థుల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు బీఆర్ఎస్వీ విద్యార్థులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ
పార్లమెంట్ లో తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై నిరసన
తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీ కించపరిచాడని ఆగ్రహం
తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ… https://t.co/LXwo47pnMD pic.twitter.com/ySp2Vxbk3H
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2026